ప్రజల ఆస్తులతో కాంగ్రెస్ చెలగాటం
బీఆర్‌ఎస్ నేత అరవింద్‌శర్మ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు కష్టార్జితంతో కొనుకున్న ఆస్తులతో చెలగాటమాడుతున్నదని మహేశ్వరం నియోజకవర్గ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ(BRS General Secretary Murukuntla Arvind Sharma) విమర్శించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) ఆదేశాల మేరకు ఉమ్మడి ఆర్కేపురం డివిజన్‌లో పలు కాలనీలలో ప్లాట్లు, ఇండ్లను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం సరూర్‌నగర్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అరవింద్ శర్మ మాట్లాడుతూ.. 22 ఏ నుంచి తొలగించాలని లేని పక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆం దోళనలు ఉదృతం చేస్తామని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీ హైడ్రా, 22 ఎ బాధితుల పక్షాన అండగా ఉండి ప్రభు త్వం చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుంది అని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ లు, 420 హామీలను అమలు చేయడం లో పూర్తిగా వి ఫలం అయ్యింది అని విమర్శించారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని అని తెలిసే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుందని అరవింద్ శర్మ విమర్శించారు. కార్యక్రమం లో ఉమ్మడి ఆర్ కె పురం డివిజన్ పార్టీ అ ధ్యక్షుడు పెండ్యాల నగేష్, సీనియర్ నాయకులు న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, సాజిద్, గొ డుగు శ్రీనివాస్ ముదిరాజ్, రాంనర్సింహా గౌడ్, కంచర్ల శేఖర్, వెంకటేష్ గౌడ్, శ్యాం గుప్త, జగన్మోహన్ రెడ్డి, ఊర్మిళ రెడ్డి, పెంబర్తి శ్రీనివాస్, జావేద్, బాలు శ్రీ, ముచ్చింతల జగన్, శ్రీకాంత్ గౌడ్, వళ్లూరి రమేష్, కపిల్, దీపక్, దశరథ్, నిరంజన్ పాల్గొన్నారు.






