కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(Congress Political Affairs Committee) సమావేశం సోమవారం ప్రారంభమైంది. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar Goud) అధ్యక్షతన పీఏసీ సమావేశం జరుగుతోంది. పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.
డీసీసీలకు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) వచ్చారు. డీసీసీలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా, అనంతగిరి హిల్స్ లో జరుగుతున్న రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ కుశంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ లో పోస్టు చేశారు.




