ప్రతిభావంతులకే కాంగ్రెస్ పదవులు
‘టాలెంట్ హంట్’ ద్వారా ఎంపిక ఉంటుంది
కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ సువర్ణావకాశం కల్పిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్‌గౌడ్ తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధుల నియామకంలో సరికొత్త పద్ధతికి శ్రీకారం ట్టామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ కో ఆర్డినేటర్ శరన్‌పటేల్, పార్టీ నేతలు రామ్మోహ న్‌రెడ్డి, చరణ్‌కౌశిక్ యాదవ్, అల్లం భాస్కర్, లింగం యాదవ్, ఇందిరాశోభన్ తదితరులతో కలిసి మహేష్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన ‘టాలెంట్ హం ట్’ వినూత్న కార్యక్రమం వివరాలను ఆయన వెల్లడించారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకం కావా లని రాహుల్ గాంధీ సంకల్పించారు. అందుకోసమే పార్టీలకు అతీతంగా, కేవలం ప్రతిభ, సమాజ సేవ చేయాలనే దృక్పథం ఉన్న యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించడానికి ఈ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నామని మహేష్ కుమార్‌గౌడ్ వెల్లడించారు.
జాతీయ రాజకీయాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న వారితో పాటు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమైన ‘లౌకికవాదం’పై గట్టి పట్టున్న వ్యక్తులను గుర్తించి ఈ అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం బేగంపే టలో జిల్లా అధ్యక్షుల విస్తృత స్థాయి సమావేశం టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరి గింది. ఈ సందర్భంగా మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడు తూ.. పార్టీ సంస్థాగత నిర్మా ణం, సభ్యత్వ నమోదు, దళిత సాధికారత, ప్రజా సమస్యల పరిష్కారం, రాబోయే కార్యాచరణపై చర్చించారు.






