calender_icon.png 9 December, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బర్త్ డే..

09-12-2025 04:34:43 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ 69వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర కలను నిజం చేసిన త్యాగమూర్తి సోనియాగాంధీ అని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ఆమె సేవల్ని కొనియాడారు. అదేవిధంగా యూపీఏ చైర్మన్, పార్లమెంట్ మెంబర్ గా సోనియా గాంధీ అటు దేశానికి, పార్టీకి విశిష్టమైన సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, మాజీ కౌన్సిలర్ రోడ్డ శ్యామ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూర్ణచందర్, మత్తమారి శ్రీనివాస్, పీక లక్ష్మణ్, గంధం రమేష్,బండి శ్రీనివాస్ పాల్గొన్నారు.