calender_icon.png 9 November, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ మేధావుల మద్దతు కోరిన కాంగ్రెస్

09-11-2025 12:47:51 AM

  1. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని వినతి

తమ డిమాండ్లు పరిష్కరించాలని బీసీ మేధావుల ప్రతిపాదన

ముషీరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ కు మద్దతునివ్వాలని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం శనివారం సాయంత్రం హైదరాబాదులోని డీడీ కాలనీలో గల బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ కార్యాలయంకి వచ్చి బీసీ మేధావులు, బీసీ సంఘాల నేతల మద్దతు కోరడం జరిగింది.

కాంగ్రెస్ నుంచి ప్రతినిధుల బృందంగా పార్టీ తరపున హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఖని జ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరపత్రి అనిల్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వినయ్ కుమార్ మద్దతు కోరారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధినేతలైన మాజీ టీ.చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్ లతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ టీ.చిరంజీవులు మాట్లాడుతూ కేంద్రానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ప్రధాన మంత్రితో సంప్రదింపులు జరిపి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేందుకు కాంగ్రెస్ కృషి చేయాలని వారు కోరారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు సూచించారు. కామారెడ్డి డిక్లరే షన్ హామీలను అమలు చేయడంలో కాంగ్రె స్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కూడా ఈ సందర్భంగా విమర్శించారు.

బీసీ వాదా న్ని బలపరచడంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్‌కు తాము మద్దతునిస్తున్నట్లు వారు ప్రకటించారు. బీసీలను మూడు పార్టీ లు మోసం చేస్తున్నాయని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేసేం దుకు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారి ప్రతినిధులకు సూచించారు బీసీ వృత్తి కులాలకు సంబంధించి బడ్జెట్‌ను విడుదల చేసేం దుకు ఒత్తిడి తేవాలని కోరారు.

బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు చెప్పిన పలు డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ చర్చల్లో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయి లి వెంకన్న గౌడ్, ఎస్. దుర్గయ్య గౌడ్, అం బాల నారాయణ గౌడ్, యెలికట్టే విజయ్ కుమార్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం నేతలు చాపకూర రాజు, కెవి గౌడ్, ఎర్రమాద వెంకన్న, రాపోలు జ్ఞానేశ్వర్, ఒంటెద్దు నరేందర్, అవ్వారు వేణు, గోర శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.