calender_icon.png 14 February, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్

14-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం పనిచేస్తోందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పేర్కొన్నారు.శుక్రవారం బోరబండలోని జయశం కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్నారు.నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మొత్తం 80 మంది లబ్ధిదారులకు గాను 28 కల్యాణ లక్ష్మి, 52 షాదీ ముబారక్ చెక్కులను స్వయంగా అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు పేద తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రతి అర్హుడైన వ్యక్తికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.