14-02-2026 12:00:00 AM
తెలంగాణ ప్రభుత్వ మహిళ పెన్షనర్స్ అసోసియేషన్
ముషీరాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): అంతర్జాతీయ ఉమెన్స్ డే పురస్క రించుకుని మార్చి1న తెలంగాణ ప్రభుత్వ మహిళ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఎల్బీ స్టేడియంలో విశ్రాంత మహిళా ఉద్యోగులకు ఇండోర్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ చైర్ పర్సన్ ఉమాదేవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమాదేవి మాట్లాడారు.
ఈ క్రీడల ప్రారంభోత్సవానికి స్పోరట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని ఆమె వెల్లడించారు. అదే విధంగా మార్చి10న బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ ఐఏఎస్‌తో పాటు ఐపీఎస్ అధికారి ణిలు సుమతి, పరిమళ, విశ్రాంత న్యాయమూర్తి రాధా రాణి (ప్రెసిడెంట్) తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభు త్వం ఉద్యోగులకు హెల్త్ స్కీమ్, క్యాష్ లెస్ హెల్త్ కార్డులపై జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన మహిళ ఉద్యోగులకు సీఎం ప్రోత్సహకాలు అందించాలని కోరా రు. ఈ సమావేశంలో అసోసియేషన్ నేతలు కె. ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, జి. లక్ష్మి, వరూధిని, పి. సుగుణ, లలిత, వి.పి. రాధ, రుక్మిణి, శ్యామల, పద్మజ తదితరులు పాల్గొన్నారు.