calender_icon.png 15 February, 2026 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటింగ్‌లో కాంగ్రెస్ టాప్

15-02-2026 12:51:31 AM

15 లక్షల ఓట్లతో 39.80 ఓటింగ్ పర్సంటేజ్ 

28.75 శాతంతో రెండో స్థానంలో బీఆర్‌ఎస్

5.67 శాతంతో మూడో స్థానంలో బీజేపీ

గణనీయంగా స్వతంత్రుల ప్రభావం

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలైన మొత్తం 37,81,232 ఓట్లలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మొత్తం ఓట్లలో 15,05,006 ఓట్లు (39.80 శాతం) సాధించిన కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెంచుకోవడం ద్వారా స్థానిక స్థాయిలో పార్టీ బలాన్ని మ రింత బలోపేతం చేసుకున్నట్టు స్పష్టమైంది. గతంలో స్థానిక సంస్థల్లో ఆధిపత్యం చాటుకు న్న బీఆర్‌ఎస్ ఈసారి రెండో స్థానానికి పరిమితమవడం గమనార్హం. మరో వైపు బీజేపీ గణనీయమైన ఓటు వాటా తో మూడో శక్తిగా ఎదిగింది. 

కాంగ్రెస్ ఆధిక్యం... బీఆర్‌ఎస్‌కు దెబ్బ... బీజేపీ పురోగతి 

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 15,05,006 ఓట్లు వచ్చాయి. 

ఇది మొత్తం పోలైన ఓట్లలో 39.80 శాతం. రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల పెరుగుతున్న ప్రభావం స్థానిక ఎన్నికల్లో కూడా ప్రతిఫలించినట్లు ఈ ఫలితాలు సూచిస్తున్నాయి. గ్రామ, పట్టణ స్థాయిలో పార్టీకి పెరిగిన ఆదరణ, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీల్లో అగ్రస్థానంలో నిలిచిన బీఆర్ ఎస్‌కు ఈసారి 10,87,347 ఓట్లు మాత్రమే వచ్చాయి. 

ఓటు శాతం 28.75 శాతానికి పడిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తున్నారు. అధికారంలో లేకపోవడం, స్థానిక నాయకత్వంలో అసంతృప్తి, కాంగ్రెస్ పట్ల పెరిగిన ఆకర్షణ వంటి అంశాలు బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకును ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీకి 5,92,823 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 15.67 శాతం వాటా సాధించింది. రాష్ర్టంలో ప్రత్యామ్నా య శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న బీజేపీకి ఇది స్థిరమైన పురోగతిగా విశ్లేషిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి మద్దతు పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

స్వతంత్రుల ప్రభావం గణనీయమే... 

ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రభావం చూపించారు. 3,14,096 ఓట్లు సాధించారు. మొత్తం ఓట్లతో ఇది 8.30 శాతం కావడం విశేషం. ఈ ఫలితాల ద్వారా ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. స్థానిక అంశాలు, వ్యక్తిగత నాయకత్వం ఆధారంగా ఓటర్లు నిర్ణయం తీసుకున్నట్టు ఇది సూచిస్తోంది. అయితే ఇతర పార్టీల ప్రభావం మాత్రం అంతంత మాత్రంగానే కనిపించింది.

ముఖ్యంగా ఎంఐఎం పార్టీ 1.24 లక్షల ఓట్లు సాధించి మొత్తం ఓట్లతో 3.2 శాతం ఓట్లను పొంది కొన్ని పట్టణ ప్రాంతాల్లో తన ప్రభావాన్ని కొనసాగించింది. సీపీఐ 49,450 ఓట్లు, 1.3 శాతానికి పరిమితమైంది. సీపీఎం 22,048 ఓట్లు, 0.58 శాతం ఓట్లను సాధించింది. వీటితోపాటు బీఎస్పీ, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు పరిమిత ఓటు శాతాన్ని మాత్రమే సాధించాయి. అయితే ఈ ఓటింగ్ శాతాన్ని గమనిస్తే వ్యక్తిగత ప్రభావం, స్థానిక సమస్యల ఆధారంగా ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతుంది.