21 August, 2026 | 10:34 AM

కాంగ్రెస్‌ది తుగ్లక్ పాలన

12-06-2024 02:19 AM

బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ 

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో సోమ్ డిస్టిలరీస్ సంస్థ మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతి రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలిపారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన చూస్తుంటే తుగ్లక్ మళ్లీ పుట్టి పాలన సాగిస్తున్నాడనే అనుమానం కలుగుతున్నదని ఎద్దేవా చేశారు. సోమ్ డిస్టిలరీస్ విషయంలో మంత్రి జూపల్లి అనుసరించిన వైఖరి ఆక్షేపణీయమని విమర్శించారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే రకరకాల వైఖరుల తీసుకుని చివరకు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. అవినీతి కంపెనీకి రాష్ట్రంలో అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు.