13 July, 2026 | 9:42 PM

Breaking News

నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •  

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు

13-02-2026 04:38 PM

హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు(Telangana Municipal Election Results) వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 59 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ 12 మున్సిపాలిటీలు గెలుచుకుంది. 34 మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితాలు వచ్చాయి. మరో 10 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 3 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్ విజయం సాధించింది.

కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, కొత్తగూడెం కార్పొరేషన్ లో సీపీఐ ముందంజలో ఉన్నది. రామగుండం కార్పొరేషన్ 59వ డివిజన్ లో ఉత్కంఠ నెలకొంది. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టాడు. రీకౌంటింగ్ లో సమాన ఓట్లు రావడంతో అధికారులు ఫలితాన్ని ప్రకటించలేదు. బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం ఆధిక్యంలో దూసుకుపోతుంది.  భైంసాలో 26 వార్డులకు 12 స్థానాల్లో ఎంఐఎం విజయం సాధించింది. భైంసాలో 6 వార్డుల్లో బీజేపీ, 7 వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. భైంసా మున్సిపాలిటీలో 1 వార్డులో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ విక్టరీ కొట్టింది. మొత్తం 48 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ 27 గెలిచింది. బీఆర్ఎస్‌-9, బీజేపీ-4, AIFB-4, మజ్లిస్-2, 2 స్వతంత్రులు గెలిచారు.