24 July, 2026 | 6:47 PM

మోదీ తీన్మార్

05-06-2024 02:07 AM

నమో 3.0

కేంద్రంలో హంగ్: ఏపార్టీకీ మెజారిటీ ఇవ్వని ఓటర్లు

240 సీట్ల దగ్గరే ఆగిపోయిన బీజేపీ u ఎన్డీయే కూటమికి 292 స్థానాలు

మూడోసారి ప్రధాని కానున్న మోదీ 

* వరుసగా మూడోసారి ఎన్‌డీఏను ప్రజలు విశ్వసించారు. ఇది భారత చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం. ప్రజలు చూపించిన ఆప్యాయతకు వినయంగా నమస్కరిస్తున్నా. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు గత పదేళ్లలో చేసిన మంచి పనులను కొనసాగిస్తామని మాటిస్తున్నా. మా కోసం ఎంతో శ్రమించిన కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నా. వాళ్లు చేసిన కృషికి కేవలం మాటలతో కృతజ్ఞతలు చెప్పడం ఎంతమాత్రం న్యాయం కాదు. థ్యాంకూ ఒడిశా! ఇది సుపరిపాలనకు, ప్రత్యేకమైన ఒడిశా సంస్కృతికి ఘనమైన విజయంగా భావిస్తున్నా.

ప్రజల కలలను నిజం చేయడంలో, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు అన్నివిధాలా కృషి చేస్తాం. ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్ అసాధారమైన మద్దతు తెలిపింది. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌కు, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు నా శుభాకాంక్షలు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తాం. రాబోయే కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందేలా చూస్తాం. 

పధాని నరేంద్రమోదీ 

ట్వీట్

* పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి అద్భుతంగా పోరాడింది. రాజ్యాంగాన్ని కాపాడటంలో తొలి విజయం సాధించాం. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఈ ఎన్నికలను ప్రభుత్వ వ్యవస్థలు, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావించాం. 

  కాంగ్రెస్ నేత

రాహుల్ గాంధీ

బీహార్‌లో నితీశ్‌కుమార్ జోరు

ఆంధ్రప్రదేశ్‌ను ఊడ్చేసిన టీడీపీ, జనసేన

అసెంబ్లీ లోక్‌సభ ఫలితాల్లో సంపూర్ణ ఆధిక్యం

ఘోర ఓటమి మూటగట్టుకున్న వైఎస్ జగన్

ఉత్కళ దేశంలో ఊపేసిన కాషాయ దళం

కుప్పకూలిన నవీన్ పట్నాయక్ కోట

తొలిసారి ఒడిశాలో అధికారంలోకి బీజేపీ

మూడు దశాబ్దాల బీజేడీ పాలనకు తెర 

సొంతంగా 99 సీట్లు గెలిచింది.  కేంద్రంలో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో టీడీపీ, జేడీయూ కింగ్‌మేకర్లుగా మారాయి. ఎన్డీయే కూటమిలోని టీడీపీ ౧౬ ఎంపీ సీట్లు గెలువగా, జేడీయూ ౧౪ చోట్ల విజయం సాధించింది. ఇప్పుడు ఎన్డీయేకు ఈ ౩౦ సీట్లే కీలకం. కాగా, ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని మట్టికరిపించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 35 సీట్లతో మూడో అతిపెద్ద పార్టీగా ఎదిగింది.

మెజారిటీ తగ్గినప్పటికీ బీజేపీ దేశంలో కొన్ని కొత్త ప్రాంతాలకు విస్తరించింది. చరిత్రంలో మొదటిసారి ఒడిశాలో బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. లోక్‌సభతోపాటే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 81 స్థానాల్లో విజయం సాధించి తొలిసారి ఉత్కళ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నది. మూడు దశాబ్దాలపాటు ఒడిశాను తిరుగులేకుండా ఏలిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కోటను బీజేపీ బద్దలు కొట్టింది. బీజేడీ 48 స్థానాలు  మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకొన్నది. కాంగ్రెస్ పార్టీ 14 ఓట్ల విజయం సాధించింది.

తెలంగాణలో బీజేపీ అద్భుతంగా పుంజుకొన్నది. మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 8 చోట్ల గెలిచి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. పదేండ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరువలేకపోయింది. మరో తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభంజనం కొనసాగింది. జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా పోటీచేసిన సైకిల్ పార్టీ.. సొంతంగానే 136 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజారిటీ సాధించింది. జనసేన కూడా అద్భుత విజయం అందుకొన్నది. ఆ పార్టీ పోటీచేసిన 21 చోట్లా విజయం సాధించి రికార్డు సృష్టించింది.

ఏపీలో బీజేపీ కూడా అనూహ్య విజయం అందుకొన్నది. ఆ పార్టీ 8 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. అధికార వైఎస్‌ఆర్సీపీ ఘోర ఓటమి మూటగట్టుకొన్నది. గత ఎన్నికల్లో 150కి పైగా సీట్లు సాధించిన ఆ పార్టీ.. ఈసారి 10 స్థానాలకు పడిపోయింది. నాలుగు లోక్‌సభ సీట్లు మాత్రమే గెలుచుకొన్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 9న ఏపీకి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. మొత్తంగా ఈసారి బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా మినహా బీజేపీ కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

దేశ ప్రజలు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నా రు. ఎన్నికల ఫలితాల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మరోవైపు ప్రజలు ఎన్డీయే కూటమిపై సంపూర్ణ విశ్వా సం ఉంచారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్యానించారు.

ఏమాత్రం పనిచేయని 400 సీట్ల ప్రచారం

ఓట్లు రాల్చని అయోధ్య రామ మందిరం

మందిరం ఉన్న సెగ్మెంట్‌లో బీజేపీ ఓటమి

యూపీలో సగానికి సగం తగ్గిన బలం

అంచనాలు మించిన ఇండియా కూటమి

233 సీట్లు సాధించిన విపక్ష దళం

కాంగ్రెస్‌కు సొంతంగా 99 స్థానాలు

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ మిశ్రమ ఫలితాలు

తెలంగాణ, ఏపీలో అంచనాలకు తగ్గ ఫలితం

న్యూఢిల్లీ, జూన్ 4: కేంద్రంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతున్నది. ప్రధాని నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ఆ రికార్డు సాధిస్తున్నది మోదీనే. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు సుదీర్ఘంగా సాగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడ య్యాయి. ఎన్డీయే కూటమి 294 సీట్లు గెలుచుకొని ప్రభుత్వానికి ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సాధించింది.

543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవసరమైన మ్యాజిక్ మార్కు 272 సీట్లు. ఈసారి ఏ పార్టీకీ ఇన్ని సీట్లు రాకపోవటంతో పదేండ్ల తర్వాత మళ్లీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. కాగా, ఈసారి లోక్‌సభలో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిం చింది. అయితే, 2019లో సొంతంగానే 303 సీట్లు గెలుచుకొన్న ఆ పార్టీ బలం.. ఈసారి 63 స్థానాలు తగ్గిపోవటం గమనార్హం. ఇక ఎగ్జిట్‌పోల్స్ అంచనా లను పూర్వపక్షం చేస్తూ ఇండియా కూటమి అనూహ్యంగా 231 సీట్లు గెలుచుకొని ఆశ్చర్యపర్చింది. కాంగ్రెస్