10 June, 2026 | 3:14 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఖానాపూర్‌లో కుట్రలను ఛేదించాం

06-04-2026 03:46 AM

బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వి.సుభాష్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం బీజేపీ కైవసం చేసుకుందని, కాంగ్రెస్-, ఎంఐఎం కుట్రలను ఛేదించి కాషాయం జెండాను ఎగరవేశామని పార్టీ అధికార ప్రతినిధి ఎన్ వి.సుభాష్ పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ బెదిరింపులు, ఒత్తిళ్లు, రాజకీ య దుర్వినియోగం ఏదీ బీజేపీ ముందు పనిచేయలేదన్నారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పలు ఆరోపణలు, విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పోరా డి గెలిచిన బీజేపీ, ఖానాపూర్‌లో కాం గ్రెస్ అహంకారానికి గట్టి చెక్ పెట్టిందన్నారు. మొన్న నిజామాబాద్‌లో కాంగ్రెస్, -ఎంఐఎం కుమ్మక్కు బహిర్గతమైందని, ఖానాపూర్‌లో కూడా అ దేతీరు మరోసారి బహిర్గతమైందన్నారు.

అవకతవకలు, ప్రలోభాలు, ఒత్తిళ్ల మధ్య కూడా బీజేపీ వెనక్కి తగ్గలేదని, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు నాయకత్వంలో కీలక విజయా న్ని సాధించామని సంతోషం వ్యక్తంచేశారు. ప్రజల మద్దతే బీజేపీకి అసలై న శక్తి అని మరోసారి రుజువైందని, ప్రజల నమ్మకంతో ముందుకు వెళుతున్న పార్టీకి ఇది మరో మైలురా యని పేర్కొన్నారు. ఖానాపూర్ నుం చి ప్రారంభమైన మార్పు తెలంగాణ అంతటా కొనసాగుతుందని ఆయన తెలిపారు.