రాష్ట్రంలో ఐదు రోజులు వర్షాలే
06-04-2026 03:45 AM
హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయ క్రాంతి): తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ తెలిపింది. ఈ నెల 10 వ రకు ఉరుములు, మెరుపులు, ఈదు రుగాలులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది. సోమవారం ఉమ్మడి ఆది లాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ, హైదరాబాద్, మహబూ బ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.




