calender_icon.png 14 January, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సంస్థ నిర్వీర్యానికి కుట్రలు

14-01-2026 12:00:00 AM

ఏఐటీయూసీ అడిషనల్ జనరల్ సెక్రటరీ రంగయ్య

మణుగూరు,జనవరి 13 (విజయక్రాంతి) :సింగరేణి సంస్థ నిర్విర్యానికి కుట్రలు జరు గుతున్నాయని ఏఐటియుసి అడిషనల్ జనరల్ సెక్రటరీ మిరియాల రంగయ్య తీ వ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఏరియాలోని కేసిహెచ్ పి లో జరిగిన గేట్ మీటింగులో ఆయన పాల్గొని, ప్రసంగించా రు. ఏరియాలోని పీకే ఓసి2 డీప్ సైడ్ (ఎక్స్టెన్షన్) బొగ్గు బ్లాక్ విషయంలో సింగ రేణిని పక్కన పెట్టి జెన్కోను ముందుపెట్టి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం సింగరేణి మనుగడపై జరిగిన ప్రత్యక్ష దాడి అని విమర్శించారు.గతం లో తాడిచెర్ల బొగ్గు బ్లాక్ను ప్రైవేటు కాం ట్రాక్టర్లకు అప్పగించడం వల్ల సింగరేణికి జరిగిన నష్టాన్ని కార్మికులు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలంతా చూశారని గుర్తు చేశారు.అదే విధానాన్ని ఇప్పుడు మణు గూరులో కూడా అమలు జరిపేందుకు కు ట్రలు జరుగుతున్నాయన్నారు.

ఎక్స్టెన్ష న్ బొగ్గు బ్లాక్ ను సింగరేణికే వేలంపాట ద్వారా కేటాయించేందుకు వెంటనే అను మతి మంజూరు చేయాలని,జెన్కో వేలం పాటలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.జెన్కో పేరుతో ప్రైవేటీక రణకు దారితీసే అన్ని నిర్ణయాలను వెంట నే రద్దు చేయాలన్నారు.సింగరేణి మనుగ డపై రాజీ పడితే, కార్మికుల నుంచి తీవ్ర ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. సింగరేణి సంస్థను నాశనం చేసే ఏ ప్రయ త్నాన్నైనా ఏఐటియుసి సహించదని,అ వ సరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమా లకు సిద్ధంగా ఉన్నామనిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శివై. రాంగోపాల్, బ్రాంచి వైస్ ప్రసిడెంట్ రామ నర్సయ్య,నాయకులు మేకల ఈశ్వర రా వు, ఆవుల నాగరాజు, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.