calender_icon.png 14 January, 2026 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలి

14-01-2026 12:00:00 AM

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

ఖమ్మం, జనవరి 13 (విజయ క్రాంతి): జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటూ కార్యక్రమాలు చేస్తున్నామని, మూడు సంవత్సరాలలో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో ని లవాలని రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు.మంత్రి తు మ్మల నాగేశ్వరరావు మంగళవారం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపా లెం లో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్, మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సం స్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

అనంతరం మంచు కొండలో ప్రాజెక్టు నీటి డె లివరీ సిస్టం వద్ద పూలతో కృష్ణ నీటికి మం త్రి ఘన స్వాగతం పలికి నిర్వహించిన బహిరంగ సభలో రైతులనుద్దేశించి మంత్రి తు మ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత ఏ డాది ఇదే రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఏడాది నాటికి సాగు నీరు విడుదల చేస్తామ ని హామీ ఇచ్చామని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్త మ్ ల సహకారంతో ఈ పనులను సకాలం లో పూర్తి చేశామని అన్నారు. రఘునాథపాలెం మండలంలో అధికంగా గిరిజనులు, చిన్న, సన్న కారు రైతులు అధికంగా ఉంటారని, వీరికి కృష్ణ నీరు అందించేందుకు నాగా ర్జున సాగర్ ఎడమ కాల్వపై లిఫ్ట్ ఏర్పాటు చేసి సాగు నీటీ ఆకాంక్ష తీర్చామని అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు 300 వరకు లిఫ్ట్లు ఏర్పాటు చేశామని మంత్రి గుర్తు చేసుకున్నారు.

ఎన్‌ఎస్పీ మీద మంచుకొండ ఎత్తిపోతల పథకం చివరి లిఫ్ట్ అని, సీతారామ ఎత్తిపోతల పథ కం పూర్తి చేసుకుంటే గోదావరి జలాలు పుష్కలంగా మనకు లభిస్తాయని అన్నారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఉన్న నీటితో రైతులు పంటలు పండించేందుకు తాత్కాలికంగా ఈ లిఫ్ట్ ఏర్పాటు చేశామని అన్నారు. బుగ్గవాగు ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుంటే ఎటువంటి లిఫ్ట్ లేకుండా గ్రావీటీ ద్వారా చెరువులు నింపుతామని అన్నారు. రఘునాథపాలెం మండలానికి కృష్ణా జలా లు, బుగ్గవాగు జలాలు, వర్షాధారంతో నీళ్ళొచ్చిన, సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు వస్తాయని తెలిపారు.

ప్రజలు తమ పిల్లలను బాగా చదివించేందుకు రఘునాథపాలెం మండలంలో స్వామి నారాయణ విద్యాసంస్థలు, యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం, వైద్య కళాశాల ఇక్కడే ఏర్పాటు అవుతున్నాయని అన్నారు.రాజమండ్రి, నాగపూర్, అమరావతి, హైదరాబాద్, ఎక్కడికి వె ళ్ళాలన్నా రఘునాథపాలెం మండలం చుట్టుపక్కల ఉన్న జాతీయ రహదారుల ద్వా రా మాత్రమే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఖమ్మం జిల్లాను ఉమ్మడి రాష్ట్రం పరిధిలో నెంబర్ 1 చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నానని అన్నారు. రఘునాథపాలెం మండల కేంద్రం, పోలిస్ స్టేషన్, ఇతర సౌకర్యాలు కల్పించామని, ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో కూడా అప్పటి పాలకులపై ఒత్తిడి పెంచి ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం, త్రాగు నీటి సరఫరా సౌకర్యం కల్పించామని అన్నారు.వ్యవసాయానికి అవసరమైన గో దాములు, ఇతర మౌళిక వసతుల కల్పన పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని అన్నారు.రైతులకు ఎటువంటి యూరియా కొరత లేదని మం త్రి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు, వి ద్యుత్ సరఫరా, సాగునీటి సమస్య లేదని మంత్రి తెలిపారు. గత పాలకులు చేసిన న ష్టాలను భరిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి అనే క సంక్షేమ పథకాలను అమలు చేస్తూ విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖ మ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖ మ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం. వెంకటేశ్వర్లు, ఎన్.పి.డి.సి.ఎల్. ఎస్.ఈ. శ్రీనివాస చారి, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, తహసీల్దార్ శ్వేత, వివిధ శాఖల అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.