calender_icon.png 15 February, 2026 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుట్రలు సాగవు!

15-02-2026 01:18:59 AM

  1. కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం ఎత్తుగడలు 
  2. కరీంనగర్ వేదికగా కాంగ్రెస్ హామీల సంగతి చూస్తా
  3. ప్రభుత్వ హామీల అమలుపై లక్షలాది మందితో రోడ్లపై ఆందోళనలు
  4. మీడియా సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ కి మెజారిటీ సీట్లు వచ్చినప్పటికీ మేయర్ పీఠం కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుట్రలు చేస్తున్నాయని, ఆ పార్టీలు ఒక్కటయ్యాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ హామీల అమలుపై లక్ష మందితో కరీంనగర్‌నుంచే ఆందోళన చేపడతామని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఇక్కడి నుం చే ప్రశ్నిస్తానని ఆయన హెచ్చరించారు.

కరీంనగర్‌నుంచే తాను యుద్ధం ప్రకటించబోతున్నట్లు తెలి పారు. జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసి ఒకటి ఎంఐఎంకు రాసివ్వాలనుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అని ఆయన ఎద్దేవా చేశా రు. ఈ రెండు పార్టీలతో ఎంఐఎం అక్రమ సంబంధం కొనసాగిస్తోందని, కాంగ్రెస్‌తో సంసారం చేస్తూ.. బీఆర్‌ఎస్‌కు కన్ను కొడుతున్న పార్టీ ఎంఐఎం అన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అక్రమ సంబంధానికి అనుసంధాన కర్త ఎంఐఎం పార్టీ అని విమర్శించారు. మోదీ పరిపాలన, కార్యకర్తల కష్టంతో కరీంనగర్‌లో బీజేపీ  మెజారిటీ స్థానా లు గెలుచుకుందని, అద్భుతమైన తీర్పు ఇచ్చిన కరీంనగర్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇండిపెండెంట్లు కూడా బీజేపీలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటామన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిస్తే కూడా 26 సీట్లకే పరిమితమయ్యాయని, అయినా బీజేపీకి మేయర్ పదవి రానియ్యకూడదని ఆ మూడు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు.

కరీంనగర్ వేదికగా ఈ మూడు పార్టీ ల బండారం బయటపడబోతోందన్నారు. ఆ పార్టీల దిగజారుడు రాజకీయాల ను జనం అసహ్యించుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు బహిరంగంగా ఒక్కటై మాట్లాడుకుంటున్నారని, సీఎం ఫోన్ చేసి కోరారు.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, కాంగ్రెస్ ప్రతిపాదించే అభ్యర్ధికి మద్దతిద్దామని స్థానిక ఎమ్మె ల్యే తన పార్టీ కార్పొరేటర్లకు చెబుతున్నారన్నారు.

తమకే మేయర్ పదవికావాలని ఎంఐఎం కోరుతోందని, ‘మీకున్న సంఖ్య ఎంత? మీరు ఎట్లా మేయర్ అవుతారు’? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ కార్పొరేటర్లను కూడా ప్రలోభపెట్టాలని చూస్తున్నారని, కానీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రలోభాలను బీజేపీ కార్పొరేటర్లు ఛీత్కరిస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌లో కలిసి ఉండాలని కాం గ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు తీసుకున్న నిర్ణయమా ఇది, లేక ఆ పార్టీల అధిష్ఠానం  నిర్ణయమా? స్పష్టం చేయాలని ఆయన డిమండ్ చేశారు.

ఎందుకు అరెస్టు చేస్తలేరు..

ఈ ఒప్పందం కారణంగానే ఫోన్ ట్యాపిం గ్, డ్రగ్స్, ఈ ఫార్ములా రేసు, కాళేశ్వరం కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయరా? అని ఆయన నిలదీశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని, ఇది గమనించే ప్రజలు బీజేపీని ఆశీర్వదించారన్నారు. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను హెచ్చరిస్తున్నా.. బిడ్డా.. ప్రజాతీర్పుకు భిన్నంగా కుట్రలు చేస్తే కరీంనగర్ నుండే మీ అంతు చూస్తా, బీజేపీ శక్తి ఏందో.. కరీంనగర్ ప్రజల దమ్మేందో చూపిస్తా’మని ఆయన హెచ్చరించారు. ‘ఒక్కొక్కరిని రోడ్లపై ఉరికిస్తాం.. ప్రజాతీర్పును కాలరాస్తే.. కరీంనగ ర్‌లో ఒక్క కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతను తిరగనీయ’నని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సెగతగిలిస్తా...

కరీంనగర్ వేదికగానే కాంగ్రెస్ హామీల సంగతి చూస్తానని, కరీంనగర్ నుంచే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై యుద్ధం ప్రకటిస్తానని హెచ్చరించారు. మహిళలకు ఇస్తానన్న రూ.2500లు ఎందుకు ఇవ్వడంలేదో లక్షలాది మంది మహిళలను రోడ్లపైకి తీసుకొ చ్చి నిలదీస్తా.. రూ.4 వేల పెన్షన్ ఎందుకిస్తలేరో.. వృద్దులందరినీ రోడ్లపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానన్నారు.

రిటైర్డ్ బెన్ ఫిట్స్, డీఏల పైసలురాక రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయ, ఉద్యోగులందరినీ రోడ్డుపైకి ఎక్కిస్తానని, లక్షలాది మంది రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులందరినీ రోడ్లపైకి తీసు కొస్తానని, బీజేపీ సత్తా ఏందో, కరీంనగర్ ప్రజల దమ్మును చూపి కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు సెగ తగిలిస్తానన్నారు. తాము రాత్రింబ వళ్లు కష్టపడి మోదీ చేసిన అభివృద్ధి నినాదంతో ప్రజల్లోకి వెళ్లి గెలిస్తే, మీరు ప్రజా తీర్పును కాలరాస్తే చూస్తూ ఊరుకోమని, మా దమ్మేందో చూపిస్తామన్నారు.

మైండ్ లేనోళ్లు ఆడే మైండ్ గేమ్‌ను చూసి జనం అసహ్యించుకుంటున్నారని, ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలారా.. కరీంనగర్‌లో కాంగ్రెస్ కు బీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుంది.. దీనికి మీరు సమ్మతమేనా’? అని ప్రశ్నించారు. గత ఎన్నికలకు ముందు చాలా జిల్లాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు క్యాడరే లేదని, బీజేపీ రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోబోతోందన్నారు. 

ఎవ్వరితో పొత్తుపెట్టుకోం..

బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని ఆయన స్పష్టంచేశారు. తాను ఎవరికీ భయపడనని, కరీంనగర్‌లో తనను ఓడించడానికి రేవంత్‌రెడ్డి, బడే భా య్ ఒవైసీ, చోటా భాయ్ అక్బరుద్దీన్‌పాగా వేసినా ఏమీ చేయలేకపోయారన్నారు. బీజే పీ అభ్యర్థులు కట్టర్, కమిట్‌మెంట్‌తో ఉం టారు.. ఇతర పార్టీల్లోకి వెళ్లరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏందో చూస్తారని చెప్పారు. కరీంనగర్‌కు తానేం చేశానో  ప్రింట్‌చేసి ఇం టింటికీ పంపించామని, ఎవరో ఏదో కూస్తే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

జీవంలేని పార్టీ ఎంఐఎం..

జీవంలేని పార్టీ ఎంఐఎం.. ఇయాళ పునరుజ్జీవ ఉత్సవాలు జరుపుకోవడం హాస్యా స్పదమన్నారు. రజాకార్లు పాకిస్తాన్ వెళుతూ ఎంఐఎం పార్టీని ఇక్కడ వదిలేసి వెళ్లారని, ‘పునరుజ్జీవం అంటే రజకార్ల పాలనను తీసుకొస్తారా?, తెలంగాణ ఆడబిడ్డలను బట్టలిప్పి బతుకమ్మ ఆడించాలనుకుంటున్నారా’? అన్నారు. మజ్లిస్ పార్టీని ముస్లిం మహిళలే అసహ్యించుకుంటున్నారని, ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలంతా మోదీకి మద్దతిస్తున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మహిళలు బహిరంగంగానే కమలం పువ్వు పట్టుకుని బీజేపీకి సపోర్ట్ చేశారన్నారు. 

కరీంనగర్‌లో బీజేపీ విజయం రాష్ట్ర ఇంటెలిజెన్స్‌కే అంకితమని పేర్కొన్నారు. కార్పొరేషన్‌లో బీజేపీకి 13 సీట్లే వస్తాయని స్టేట్ ఇంటెలిజెన్స్ సీఎంకు నివేదిక ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఇకనైనా సీఎం కళ్లు తెరవాలన్నారు. మేయర్ పదవి కోసం గుంట నక్కలన్నీ ఒక్కటైనా, బీజేపీ సింహం సింగిల్‌గానే పోటీ చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, లీగల్ సెల్ నాయకులు ఆంటోనీ రెడ్డి, అధికార ప్రతినిధి జే సంగప్ప, రాష్ట్ర నాయకులు కళ్యాణ్‌నాయక్, రవి కిరణ్ పాల్గొన్నారు.