calender_icon.png 15 February, 2026 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేజార్చుకోవద్దు

15-02-2026 01:31:04 AM

  1. మేయర్, చైర్మన్లే కీలకం
  2. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి
  3. ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం
  4. కొత్తగూడెం మేయర్ పీఠంపై తలా రెండున్నరేళ్లు సీపీఐతో కాంగ్రెస్ ఒప్పందం

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి) : హంగ్ మున్సిపాలిటీల్లో చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడ మే కీలకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్టు తెలుస్తోంది. శనివారం జూబ్లీహిల్స్‌లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, ఇంఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీ క్షించిన సీఎం మంత్రులకు, ముఖ్య నేతలకు మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ పదవులను చేజిక్కించుకోవడంపై దిశానిర్దేశం చేశా రు. ఈ విషయంలో ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు సూచించినట్టు సమాచారం. నిజామాబాద్, కొత్తగూడెం మేయర్ పదవులను కాంగ్రెస్ ఖాతాలో వేసుకునేందుకు వ్యూ హాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

కార్పొరేషన్ల వారీగా సంఖ్యా బలం, మద్దతు అవకాశాలు, రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించినట్టు సమాచారం. మున్సి పల్ ఎన్నికల ఫలితాల్లో కొన్ని కార్పొరేషన్లలో స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే వ్యూ హాత్మకంగా అడుగులు వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా సంఖ్యా బలం పరంగా సమీకరణాలు మార్చుకునే అవకాశం ఉన్న నిజామాబాద్, కొత్తగూ డెం కార్పొరేషన్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

నిజామా బాద్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎంఐఎం మద్దతు కీలకమని కాంగ్రెస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎంఐ ఎం నేతలతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. ఈ బాధ్యతను టీపీసీసీ చీఫ్‌కు అప్పగించినట్లు సమాచారం. ఎంఐఎం మద్ద తు లభిస్తే కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ పీఠం అధిరోహించే అవకాశాలు బలపడతాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. 

కొత్తగూడెంలో స్వతంత్రులే కీలకం... 

కొత్తగూడెం కార్పొరేషన్‌లో పరిస్థితి మరిం త ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లేకపోవడంతో స్వతంత్రులు, చిన్న పార్టీల కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్రులను తమవైపు తిప్పుకునేందుకు వ్యూ హాత్మకంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. కొత్తగూడెం అంశాన్ని పరిశీలించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. స్వతంత్ర కార్పొరే టర్లతో చర్చలు జరిపేందుకు స్థానిక నేతలకు పార్టీ ప్రత్యేక సూచనలు ఇచ్చినట్టు తెలిసింది.

అభివృద్ధి పనుల్లో ప్రాధాన్యత, స్థానిక సమస్యల పరిష్కారంలో సహకారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ మద్దతు సమీకరించే ప్రయత్నాలు చేయాలని, అవసరమైతే ఇతర పార్టీలకు చెందిన అసంతృప్తి కార్పొరేటర్ల మద్దతు కూడా పొందే దిశగా చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీంతోపాటు 16న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎక్స్ అఫిషియో ఓట్ షేర్‌పై కూడా సీఎం పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. 

కలిసికట్టుగా పనిచేయడంతోనే మంచి ఫలితాలు...

మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన సందర్భంగా మంత్రులందరినీ సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. అందరం కలిసికట్టుగా పనిచేయడం వల్లే మంచి ఫలితాలు సాధించామన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనులను ప్రజా ప్రభుత్వం రెండేళ్లల్లో చేసి చూపించిందన్నారు.

రెండేళ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజా పాలనపై నమ్మకాన్ని కలిగించాయనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని తెలిపారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఎన్నికల ఏవైనా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని మంత్రులకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రాష్ర్టంలో ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

సీపీఐ నేతలతో చర్చలు

మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తరువాత, సీఎం రేవంత్‌రెడ్డి.. సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డితో కొత్తగూడెం కార్పొరేషన్‌పై చర్చించారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన సీపీఐ, కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో కలిసిరావాలని ఈ సందర్భంగా సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ చర్చ ల్లో.. కొత్తగూడెం మేయర్ పీఠాన్ని రెం డున్నరేళ్లు కాంగ్రెస్ పార్టీ, మరో రెండున్నరేళ్లు సీపీఐ పంచుకునేందుకు అంగీ కారం కుదిరింది.