1 June, 2026 | 2:45 AM

విచ్ఛిన్నానికి కుట్ర

01-06-2026 01:58 AM

మా మధ్య అంతర్యుద్ధానికి పన్నాగం

  1. చిల్లర రాజకీయాలు మానుకోవాలి 
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  3. ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలపై ఖండన
  4. డీజీపీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ సీపీలకు ఫిర్యాదు

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): బీజేపీ నేతల ఐక్యతను దెబ్బతీసేందుకు కొం దరు కుట్రలు చేస్తున్నారని, మా మధ్య అంతర్యుద్ధానికి కొందరు పన్నాగం పన్నుతున్నా రని, మా మధ్య విభేదాలు సృష్టించడానికి కొన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయా లు మానుకోవాలని హెచ్చరించారు.

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకం గా వెలిసిన ఫ్లెక్సీల ఉదంతాన్ని తాను తీవ్రం గా ఖండిస్తున్నాని, ఈ విషయంపై డీజీపీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ సీపీలకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇలా ఫ్లెక్సీ లు వెలువడం ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడేనని, బీజేపీని చూసి ప్రత్యర్థులు భయపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు తెలిపారు. ఈటల రాజేందర్‌పై ఫ్లెక్సీల ఘటనను వారంతా ముక్తకంఠంతో ఖండించారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా మల్కాజిగిరిలో, సికింద్రాబాద్‌లో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆదివారం కలకలం రేపుతోంది. ‘ఈటల నువ్వు బీజేపీలో చేరి చేసిందేంటయ్యా..? అని, బీజేపీలో చేరి గ్రూపులు కడుతున్నాడు? అని ఆ ఫ్లెక్సీల్లో గుర్తు తెలియని వ్యక్తు లు పేర్కొన్నారు. ఇతరులను ఎదగనీయకుం డా చేస్తున్నారని అందులో ఆరోపించారు. దీని పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు స్పందిస్తూ ఆదివారం ఒక వీడియోను విడుదల చేశారు.

కొంతమంది బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పైన కొన్ని అభియోగాలతో మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌లో పెద్దపెద్ద ఫ్లెక్సీలను పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించా రు. బీజేపీకి రాష్ట్రంలో బలం పెరుగుతుండటంతోనే ఈ పనిని బీజేపీ వ్యతిరేకులు ఈ విధం గా చేశారన్నారు. బీజేపీ నాయకుల మధ్య ఐక్యత స్పష్టంగా కనబడుతుండటంతో బీజేపీని బలహీనపర్చాలనే ఉద్దేశంతోనే కొందరు వ్యక్తులు, కొన్నిపార్టీలు కలిసి చేస్తున్న పన్నాగమిదన్నారు.

దీన్ని కుట్రగా భావిస్తున్నామని స్పష్టం చేశారు. బీజేపీశ్రేణుల మధ్య విభేదాలు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న వారిని బీజేపీ హెచ్చరిస్తుందని తెలిపారు. ఇటువంటి చిల్లర రాజకీయాలను మానుకోవాలని, బీజేపీ నా యకులంతా ఐక్యంగా ఉన్నారని, తమకు ఎదురుగా వచ్చి రాజకీయం చేయలేని పార్టీలు ఇలా బీజేపీని బలహీన పర్చాలని చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై డీజీపీకి, మల్కాజ్‌గిరి కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

దర్యాప్తు జరగాలని, దీనివెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ని కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను- తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల ఓర్వలేని తనానికి నిదర్శనమన్నారు.

ఈటల రాజేందర్ దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడని, ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేతని, అలాంటి వ్యక్తిని కించపరిచే ప్రయత్నం చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేని అధికారపార్టీతోపాటు ప్రత్యర్థిశక్తుల పాత్రపై కూ డా సమగ్ర విచారణ జరగాలని, బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉందని, ఇలాంటి కుట్రలు బీజేపీ ఐక్యతను దెబ్బతీయలేవని, ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈటల పై ఫ్లెక్సీల ఘటనను ఖండించిన వారిలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, డాక్టర్ పాల్వాయిహరీశ్‌బాబు, రామరావు పటేల్, రాకేష్‌రెడ్డి, సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌రెడ్డి, అంజిరెడ్డి, కొమరయ్య ఉన్నారు.

యువత స్ఫూర్తి పొందేలా మోదీ ‘మన్ కీ బాత్’

యువత స్ఫూర్తి పొందేలా ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని దేశ యువత తప్పక చూడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన 134వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, కేఎంఐటీ లేన్ వద్ద పెరిక సురేష్ నివాసంలో పార్టీ నాయకులతో కలిసి రాంచం దర్‌రావు వీక్షించారు.

ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రధాని  మోదీ ప్రతి ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్ ద్వారా దేశానికి అవసరమైన అనేక స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటు న్నారని పేర్కొన్నారు. క్రీడల్లో మన క్రీడాకారులు కనబరుస్తున్న ప్రతిభ, వారు పడు తున్న కష్టం, వారి విజయగాథలు యువతకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో మనవాళ్లు సాధిస్తున్న అద్భుతమైన రికార్డులు భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటుతున్నాయని కొనియాడారు.

చారిత్రక అంశాల ను ప్రస్తావిస్తూ రాజరాజ చోళుని సముద్రయాన ఘనతను, సాహసాలను ప్రధాని గుర్తు చేయడం అభినందనీయమన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను, అలాగే మన సంప్రదాయ స్వదేశీ పానీయాలైన మామిడి పన్నా, సత్తు, సబ్జా గింజలతో తయారు చేసే రసాల ప్రాముఖ్యతను వివరించడం ద్వారా సామాన్య ప్రజలకు మేలు జరిగేలా ప్రధాని దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు.

‘మన్ కీ బాత్’లోని ప్రతి ఎపిసోడ్.. కొత్త సమాచారాన్ని, కొత్త స్ఫూర్తిని ఇస్తుందని, అందుకే ఈ కార్యక్రమాన్ని దేశ యువ త తప్పక చూడాలని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి అభయ పాటిల్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి వీరేందర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.