మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
ఎల్లారెడ్డి మే 31 (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారి గురించి గానీ, కాంగ్రెస్ పార్టీ గురించి గానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు. అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కురుమ సాయిబాబా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే మదన్మోహన్ పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, హాజరయ్యారు ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ లు మాట్లాడారు వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చాలదా..?
మళ్లీ రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలే సరైన సమాధానం చెబుతారు. అని అని అన్నారు వ్యక్తిగత విమర్శలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు కార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ, సీనియర్ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఉపాధ్యక్షులు మతమాల ప్రశాంత్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మేంబర్లు, ఆయా గ్రామ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.






