17 April, 2026 | 1:41 AM

కులగణనలో కుట్ర!

17-04-2026 12:02 AM
  1. మా జనాభాను తక్కువగా చూపించారు 
  2. సర్కార్‌పై మాదిగ, ముదిరాజ్, గౌడ కులాల ఆగ్రహం
  3. 2011 జనాభా లెక్కల్లో 33 లక్షలకుపైగా ఉన్న మాదిగలు..
  4. 14 ఏళ్లలో మూడున్నర లక్షల జనాభానే పెరిగిందా? 
  5. కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో 45 లక్షలు ఉన్నాం
  6. ఇప్పుడు 26 లక్షలుగానే చూపించారు 
  7. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ముదిరాజ్ కుల సంఘాలు 
  8. రెడ్డి సామాజికవర్గం కంటే మేం తక్కువగా ఉన్నామా? 
  9. గౌడ కుల సంఘాల నాయకులు ఆందోళన  
  10. కులం పేరు చెప్పనివారు 14 లక్షలు ఉంటారా? 
  11. అనుమానం వ్యక్తం చేస్తున్న వివిధ కుల సంఘాలు

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల సర్వే గణాంకాలపై భిన్నాభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. జనాభాను తకు ్కవగా చూపించారని కొన్ని కుల సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన జానభా కంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేలో తమ జనాభాను తక్కువగా చూపించేందుకు కుట్రలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో మాదిగ సామాజికవర్గమే టాప్‌లో ఉన్నది. రెండో స్థానంలో బీసీ కులాల్లోని ముదిరాజ్ సామాజికవర్గం నిలిచింది. ఈ కుల గణనపై మాదిగ, ముదిరాజ్ సామాజికవర్గాల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 33.33 లక్షలకుపైగా జనాభా ఉంటే.. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో మాదిగల జనాభా 36.57 లక్షలు మాత్రమే చూపెట్టడమేంటి? అని ఆ సామాజికవర్గం నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాదిగల జనా భా కనీసం 42 లక్షలకుపైగా ఉంటుందని చెప్తున్నారు.

ప్రతి గ్రామంలో గౌడ సామాజికవర్గం ఎక్కువగానే ఉంటుందని, ప్రభు త్వం నిర్వహించిన కులగణనలో 16.30 లక్షలే చూపించారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం కంటే తమ కుల జనాభాను తక్కువగా చూపిస్తున్నారని గౌడ సంఘం నాయకులు సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే 2011 జనాభా లెక్కల ప్రకారం రెడ్డి సామాజికవర్గం జనాభా 9 లక్షలకు పైగా ఉంటే, ఇప్పుడు ఏకంగా 17.10 లక్షలకుపైగా చూపించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. పద్మశాలిలు కూడా ప్రతి గ్రామంలో ఉంటారని, వారి జనాభా తక్కువగా చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముదిరాజ్‌ల జనాభా లెక్కలపై అభ్యంతరం

ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కలపై ముదిరాజ్ కుల సంఘం నాయకులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 2014 మధ్యకాలంలో అప్పటీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ముది రాజ్‌ల జనాభా సుమారు 45 లక్షలు ఉన్నట్టు తేలిందని, ఇప్పుడు 26.39 లక్షలుగానే చూపించారని వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా’ విడుదల చేసే ‘సివిల్ రిజిస్టేషన్ సిస్టమ్’ నివేదిక ప్రకారం 2015 తర్వాత తెలంగాణలో ఏటా సగటున 6 లక్షల జననాలు, 2 లక్షల మరణాలు నమోదవుతున్నాయని, అంటే ఏటా సుమారు 4 లక్షల నికర జనాభా ఉంటుందని గుర్తుచేస్తున్నారు. అంటే ఈ పదేళ్లలో జనాభా భారీగా పెరిగిందని, ఈ జనాభా పెరుగదల ముదిరాజ్ కులానికి వర్తించడం లేదా? అని ముదిరాజ్ చైతన్య వేదిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. 14 లక్షల మంది వరకు కులం చెప్పని వారున్నారనడంలో వాస్తవం ఉండకపోవచ్చనే అభి ప్రాయం కూడా వ్యక్తంచేస్తున్నారు. ప్రతి కుల సంఘం నాయకులు కూడా ప్రభు త్వం నిర్వహించిన కులగణనపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.