17 April, 2026 | 2:10 AM

దంచికొట్టిన ఎండ

17-04-2026 12:02 AM
  1. ధర్మపురిలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
  2. నేడు పలు జిల్లాల్లో వర్షాలు

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నా యి. పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. గురువారం పలు ప్రాం తాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారు. ఉదయం 9 గం టల నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. రా ష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరా యి. మధ్యాహ్నం పూట జనం రోడ్లపై వచ్చేందుకు జంకుతున్నారు.

రోడ్లన్నీ నిర్మానుష్యం తా కనిపిస్తున్నాయి. గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో 44.4 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలా, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు, మంచిర్యాల జిల్లా జన్నారం, నల్లగొండ జిల్లా దేవరకొండ, నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 44.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ 41.5 డిగ్రీల నుంచి 44.1 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి.

అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. జోగులాంబ గద్వాల జిల్లా, వనపర్తి, నాగర్‌కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతా యని తెలిపింది. మళ్లీ ఈనెల 20, 21, 22, 23న కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.