calender_icon.png 20 January, 2026 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబీసీడీ వర్గీకరణ కొట్టివేయాలని కుట్ర

19-01-2026 12:00:00 AM

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ

ముషీరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): కొంతమంది మాల స్వార్థ పరులు జీర్ణించుకోలేక ఏబీసీడీ వర్గీకరణ కొట్టివేయాలని తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు శిక్షణ తరగతులకు నోటిఫికేషన్ జారీ చేసిందని, దానివల్ల ఈనెల 21 మాదిగ సర్పంచుల, ఉప సర్పంచుల సన్మాన సభను వాయిదా వేస్తున్నామ న్నారు.

ఈనెల 21న రామంతపూర్ లోని లింగారెడ్డి గార్డెన్స్ లో జరిగే ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల సంఘాల పేరు మీద. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు జరుపుతున్నారని పేర్కొన్నారు.

గతంలో ఎస్సీ వర్గీకరణ జరిగితే కొంతమంది మాల సోదరులు కోట్లాది రూపాయలు సుప్రీంకోర్టులో వెదజల్లి, ఎస్సీ వర్గీకరణ చెల్లదని కొట్టివేయించారని గుర్తు చేశారు. మాదిగల సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రంలోని మాదిగ మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమా వేశంలో ఎంఆర్పీఎస్ నేతలు దాసీ మోహ న్, విజయ్ కుమార్, యాదగిరి, చింత నర్సింహ, రుక మ్మ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.