calender_icon.png 20 January, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపం

19-01-2026 12:00:00 AM

సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 

సికింద్రాబాద్ జనవరి 18 (విజయ క్రాంతి) : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ప ష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ 220 సంవత్సరాల గణ చరిత్ర కలిగిన సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ర్యాలీ జరగకుండా పోలీసులు పెద్ద సంఖ్య లో మోహరించి ఎక్కడికక్కడ అరెస్ట్‌లు, నిర్బంధాలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని అన్నారు. ఒక భయానక వాతావరణం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కార్పొరేటర్‌లు టీ మహేశ్వరి, శైలజ, ప్రసన్న, సునీత, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి,

మాజీ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ టి ఎన్ శ్రీనివాస్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, నలిని కిరణ్, అనిత ప్రభాకర్,బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, హన్మంతరావు, నాయకులు నాగులు, శ్రీహరి, కిషోర్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, సురేష్ గౌడ్, మహేష్ యాదవ్, అశోక్ యాదవ్, పనసా సంతోష్, కరుణాకర్ రెడ్డి,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.