calender_icon.png 20 January, 2026 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేటెడ్ పదవీ కాలం పొడిగింపు

19-01-2026 12:00:00 AM

నామినేటెడ్ కుర్చీపై పెట్రోల్ పోసి తగలబెట్టిన బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నే క్రిశాంక్

సికింద్రాబాద్ జనవరి 18 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు సివిలీయన్ నామినేటెడ్ పదవి కాలాన్ని మరో ఏడాది పొడగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, మైనింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మన్నే క్రిశాంక్ ఆదివారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. నామినేటెడ్ పదవికాలాన్ని పొడగిస్తూ కేంద్రం రిలీజ్ చేసిన గెజిట్ కాపీని ధ్వంసం చేయడం తోపాటు నామినేటెడ్ కుర్చీపై పెట్రోల్ పోసి గులాబీ శ్రేణులు నిప్పంటించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా క్రీశాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్‌లో బీజేపీ ప్రజా స్వా మ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ మండిపడ్డారు. సంవత్సరాల తరబడి కంటోన్మెంట్ లో ఎన్నికలు నిర్వహించకుండా జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం పేరిట కాల యాపన చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే కంటోన్మెంట్ బోర్డు ఎదుట ఆందోళన చేస్తూ, గెజిట్ కాపీలను, కుర్చీని ధ్వంసం చేయడంపై మన్నే క్రిశాంక్ పైన కేసు నమోదు అయినట్లు తెలిసింది.