ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర
రాష్ట్ర జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి
నిర్మల్, ఏప్రిల్ ౧౬ (విజయక్రాంతి): టీజీ ఆర్టీసీని నిర్వీర్యం చేస్తే కుట్ర జరుగుతుందని సంస్థ పరిరక్షణకు తప్పనిసరి సమ్మె టీజీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలో డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. మే 7 నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీజీ ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి రాకుండా ఆర్టీసీ కార్మికులందరూ సమ్మేలో పాల్గొంటున్నారని తెలిపారు.
ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాలని. పాత బకాయిలు చెల్లించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు చెల్లించాలని ప్రవేటీకరణ కుట్రలను ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏ ఆర్ రెడ్డి రిజియన్ నాయకులు గంగాధర్ పోశెట్టి తదితరులు ఉన్నారు






