5 వర్సిటీలకు ఈసీలను ప్రకటించిన ప్రభుత్వం
17-04-2026 12:16 AM
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఉస్మానియా, జేఎన్టీ యూ, శాతవాహన, తెలంగాణ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలకు కార్యనిర్వాహక మండళ్లు (ఈసీ)ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి యూనివర్సిటీకు ఈసీ సభ్యులను నియమించింది. వీరి పదవి కాలం సాధారణంగా మూడేళ్లపాటు ఉం టుంది. అయితే ఈ విషయాన్ని ప్రభు త్వం జీవోల్లో వెల్లడించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత ఈ వర్సిటీలకు ఈసీలను నియమించింది.






