17 April, 2026 | 2:14 AM

ప్రమాదాలు నివారణకు చైతన్యం చేయాలి

17-04-2026 12:18 AM

నిర్మల్, ఏప్రిల్ ౧౬ (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో ప్రమాదాలు జరగకుండా ప్రజలను చైతన్యం చేయాలని ఏ ఎస్ పి ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. గురువారం మున్సిపాలిటీలో అరైవ్ అలైన్ రోడ్డు భద్రత నియమాలపై కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రమాదాలు జరిగి ప్రదేశాలను గుర్తించి అక్కడ చేపట్టవలసిన చర్యలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై అజయ్, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. స్థానిక టూర్ పాద వద్ద సిబ్బంది వచ్చి పోయే వాహనదారులకు, రైతుల అంశాలపై అవగాహన కల్పించారు. భద్రంగా ప్రయాణం చేయాలని సూచించారు.