15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

క్రీడల బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

04-02-2026 08:40 PM

జిఎన్ఎస్ స్టేడియం వేదికగా గ్రామీణ క్రీడలకు పెద్దపీట

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సీఎం కప్ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, వైద్యం, వ్యవసాయ తర్వాత అత్యధిక ప్రాధాన్యత క్రీడలకే కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ నైనా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడికి క్రీడల శాఖ మంత్రి సార్క్ చైర్మన్ లను పంపిస్తూ క్రీడల ను మరింత ఉత్సాహపరుస్తున్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక క్రీడాకారుడు కావడం వలన క్రీడలను బలోపేతం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు.

క్రీడలు కేవలం వినోదం లేదా వ్యాయామానికి పరిమితమే కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన చెస్ క్రీడాకారుడు ప్రతిప చాటిన సందర్భంగా స్వయంగా సీఎం మే ప్రోత్సాహం అందించారని తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు ఎంత ఎంతో ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇదొక నిదర్శనం అని తెలిపారు. సీఎం కార్యక్రమాన్ని 5 అంచెలుగా నిర్వహిస్తూ, గ్రామీణ క్రీడలను బలోపేతం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేలా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని చెప్పారు.

అంతేకాకుండా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే క్రీడాకారులను తయారు చేయాలనిపిస్తుంది ప్రభుత్వం సీఎం కప్ ను నిర్వహిస్తుందని చెప్పారు. క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, ప్రోత్సహకాలు కల్పిస్తూ యువతను క్రీడల వైపు ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజిత్ ఖాన్, జిల్లా యూత్, స్పోర్ట్స్ అధికారి అశోక్, స్పెషల్ ఆఫీసర్ నందకిషోర్ గౌడ్,నెట్ బాల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్.లిల్లీ ప్లారెన్స్, అసోసియేషన్ మెంబర్లు సృజన్, కార్తీక్, రాజు, ఇతర అధికారులు, కోచ్ లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.