20 March, 2026 | 7:40 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణాలు

20-03-2026 02:22 PM

గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లోని పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని చద్మల్ తండాలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ఆదేశాలతో రూ.25 లక్షల వ్యయంతో ప్రారంభించిన సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి అయినట్టు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గ్రామంలో రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు , ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తప్పినట్టు వారు అన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బంతిలాల్, అమర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జగదీష్, మాజీ ఎంపీటీసీ ప్రేమ్ సింగ్, గ్రామస్థులు పాల్గొన్నారు.