20 March, 2026 | 4:03 PM

సాహిత్య కార్యశాల సమన్వయకర్తగా భైతి దుర్గయ్య

20-03-2026 02:24 PM

సిద్దిపేట క్రైం, మార్చి 20 : బాలల్లో సాహిత్యాభిరుచి పెంపొందించి, వారి చేత రచనలు చేయించే లక్ష్యంగా తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్  రాష్ట్రవ్యాప్తంగా బాల సాహిత్య కార్యశాలల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయుడు భైతి దుర్గయ్యను  జిల్లా సమన్వయకర్త గా నియమించింది. ఆయన ఉన్నత పాఠశాలల్లో  కార్యశాలలు ఏర్పాటు చేసి వివిధ సాహిత్య ప్రక్రియల (కథలు,కవితలు,లేఖలు,వ్యాసాలు,పాటలు,పద్యాలు )లో విషయ నిపుణులతో  విద్యార్థులకు శిక్షణ నిర్వహిస్తారని సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్  చెన్నయ్య తెలిపారు.