22 July, 2026 | 10:54 AM

ఇంటింటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి: సీఐ

22-07-2026 10:17 AM

బోథ్,(విజయక్రాంతి): ప్రజలు ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనాలను అరికట్టే వీలుందని బోథ్ సీఐ గురుస్వామి పేర్కొన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా సోనాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సోనాల మండల కేంద్రంలో జరుగుతున్న దొంగతనాలను గుర్తించేందుకుగాను నివాసాల వద్ద నిఘానేత్రాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే 100 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు. పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.