1 July, 2026 | 8:30 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

ఎల్లారెడ్డిలో నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తి

21-06-2025 10:26 PM

ఈనెల 24న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం...

ఎమ్మెల్యే మదన్మోహన్...

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో నూతనంగా నిర్మించినటువంటి ప్రయాణ ప్రాంగణం ప్రారంభోత్సవము ఈ నెల 24న మంగళవారం నూతన బస్టాండ్ ప్రారంభం జరుగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిబాబా తెలిపారు. ఈ కార్యక్రమం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు(MLA Madan Mohan Rao) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చేతుల మీదుగా ప్రయాణ ప్రాంగణం ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు.

మండల పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు ఎప్పుడు రుణపడి ఉండే రోజు ఆరోజు ఎందుకంటే ఎల్లారెడ్డి చరిత్రలోనే ఎవరు ఆలోచనలేని ఆలోచన చేయని విధంగా ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆలోచన విధానం ఎల్లారెడ్డిని అభివృద్ధిలో తీసుకోబోతున్నటువంటి విధానం మనమందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం అన్నారు.

ఎందుకంటే గత పాలకులు గత 40 సంవత్సరాల కాలంలో కూడా ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు కూడా జరిపించిన  చరిత్ర లేదు. ఈరోజు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా అభివృద్ధి జరుగుతుందంటే మనం చాలా గర్వించదగ్గ విషయం అందుకు ఎల్లారెడ్డి  ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కు ఎల్లారెడ్డి ప్రజలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ  24వ తేదీన మంగళవారం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంచేయాలని ఆయన కోరారు.