3 June, 2026 | 8:07 PM

స్మశాన వాటికకు దారి నిర్మాణం

03-06-2026 07:31 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణంలోని దస్నాపూర్ రెండో వార్డులో స్మశాన వాటికకు వెళ్లే దారిలో ఉన్న ఒర్రెపై పైపులు వేసి రహదారి నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వార్డు కౌన్సిలర్ గోవిందు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు ఒర్రెపై కల్వర్టు లేకపోవడంతో ముఖ్యంగా వర్షాకాలంలో కాలనీవాసులు స్మశాన వాటికకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను గుర్తించిన చైర్మన్, కౌన్సిలర్ ప్రత్యేకంగా చర్యలు తీసుకుని పైపులు ఏర్పాటు చేసి రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. రహదారి నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో రెండో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాలనీవాసులు సంజు, మోహన్, ప్రణయ్, శ్రావణ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.