27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ప్రజలకు ఆరోగ్య విషయాలు తెలియజేయుటకు బిహెచ్ఎన్డి వేదికలు అనువైనవి

03-06-2026 07:35 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): పిహెచ్సి నాగిరెడ్డిపేట వైద్యాధికారి డాక్టర్ సృజన్ పర్యవేక్షణలో, ఉపవైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం,ఎల్లారెడ్డి డివిజన్‌కు చెందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జి.ఠాగూర్, సబ్ యూనిట్ అధికారి పాశం గోవిందరెడ్డిలు బుధవారం నాగిరెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తాండూర్, జప్తి జాన్కంపల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న గ్రామ ఆరోగ్య, పారిశుధ్య, పోషణ దినోత్సవం వి.హెచ్.ఎన్.డి కార్యక్రమాలను ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విహెచ్ఎండి వేదికలను ఉపయోగించి గర్భిణీలు, బాలింతలు, కౌమారదశ బాలబాలికలు, గ్రామీణ ప్రజలకు ఆరోగ్య విద్య, పోషకాహారం, పారిశుధ్యం, తల్లి-శిశు ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. జూన్ మాసం "యాంటీ మలేరియా మంత్" సందర్భంగా ప్రతి జ్వర బాధితుని నుండి రక్త నమూనాలు సేకరించి మలేరియా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

అలాగే "ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్‌నైట్ (IDCF)" కార్యక్రమంలో భాగంగా ఆశా కార్యకర్తలు 0-5 సంవత్సరాల పిల్లలు ఉన్న ప్రతి ఇంటికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి డయేరియా నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని కోరారు.డయేరియా, మలేరియా వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు.