15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చెట్టును బతికించారు.!

20-05-2025 04:46 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కొత్తగా రోడ్డు వేస్తే రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్లను నేలకూల్చడం సాధారణంగా జరుగుతుంది. అయితే ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం నుండి ఇనుగుర్తి వరకు కొత్తగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తారు రోడ్డు నిర్మాణం జరిగింది. ఈ రోడ్డుకు మధ్యలో ఒక దగ్గర పెద్ద రావి చెట్టు అడ్డుగా ఉంది. అయితే ఆ చెట్టు పరిసర రైతులు చెట్టును కొట్టేయకుండా అలాగే ఉంచి రోడ్డు వేయడానికి స్థలం ఇచ్చి సహకరించారు. దీనితో గుత్తేదారు రోడ్డు మధ్యలో ఉన్న చెట్టును అలాగే ఉంచి చెట్టుకు ఇరువైపులా తారు రోడ్డు వేశాడు. దీనితో కొట్టేయకుండా చెట్టును బతికించడంతో బాటసారిలకు చల్లని నీడనిస్తూ ప్రత్యేకతను చాటుతోంది.