calender_icon.png 20 May, 2025 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంద రోజుల ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంపై అవగాహన

20-05-2025 04:57:02 PM

టీబీ, హెచ్ఐవి, డయాబెటిక్ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి..

మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శరత్ కుమార్..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): వందరోజుల ముక్త్ భారత్ అభియాన్(Mukt Bharat Abhiyan) ప్రోగ్రాంపై మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య కార్యకర్తలతో, సూపర్వైజర్లతో మతమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శరత్ కుమార్ అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సులో వైద్యులు శరత్ కుమార్ మాట్లాడుతూ... వందరోజుల ముక్త్ భారత్ అభియాన్ ప్రోగ్రాంను వైద్య సిబ్బంది, నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. టీబీ కేసులను గుర్తించి, సరియోగం మాత్రలు అందించి నివారించాలని అన్నారు. వోల్నరబల్ పాపులేషన్ లో స్పుటం, కలెక్షన్ చేసి పరీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. 

వోల్నరబల్ జనాభా పూర్వం డయాబెటిక్ కేసులు వయస్సు జనాభా కంటే 2.60 టీబీ సానుకూల కేసులు, సంప్రదింపు వ్యక్తులు హెచ్ఐవి రోగి, సంప్రదింపు వ్యక్తులు బిఎంఐ 18.5 తక్కువా ఉన్నవరూ సిగారెట్, ఆల్కహాల్ వినియోగ వ్యక్తి వోల్నరబల్ జనాభా తక్కువ లక్షణాలు అన్నవారికి స్పుటం కలెక్షన్ చేయాలి. జ్వరం, దగ్గు, తక్కువ బరువు, రాత్రి చెమట, ఛాతీ నొప్పి, శ్వాస కొరత, మెడ వాపు, కఫంలో రక్తం సేకరించి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలకు వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.