వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణం
నిజామాబాద్, జూలై 9 (విజయక్రాంతి): వారాహీ అమ్మవారి కృపా కటాక్షాలు నగర వాసులపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. నగరంలోని అమ్మానగర్‌లో నిర్మిస్తున్న ఆలయ పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలోని తొలి వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. కృష్ణశిలతో ఆలయాన్ని నిర్మించటం అత్యంత సంతోషకరమన్నారు.
ఇందూరులో ఆధ్యాత్మిక చింతన పెరిగిందని, హిందువుల ఐక్యతకు ఆలయాలు దోహదపడతాయన్నారు. యువత ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిత్య ఆలయ దర్శనం ఎంతో శ్రేయస్కరమన్నారు. ఇకపై జరిగే వారాహీ అమ్మవారి పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు మంచాల జ్ఞానేందర్, ఎల్ వీ ఆర్ అధినేత శివ ప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.






