21-07-2025 12:00:00 AM
బోయినపల్లి:జూలై 20(విజయక్రాంతి) చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో మొదలైన గంజి వాగు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.బోయినపల్లి వే ములవాడ ప్రధాన రహదారిలో ఉన్న గంజువాగు నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో గత వర్షాకాలంలో భారీ వర్షాలు పడడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
అసంపూర్తిగా మిగిలిపోయిన గంజి వాగు ను చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జి ల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లు సంబంధిత అధికారులతో ఈ నెల 9న పరిశీలించి అధికారులకు కాంట్రాక్టర్ కు త్వర తగిన నిర్మాణ పనులు మొదలుపెట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. అలాగే కాంట్రాక్టర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.