calender_icon.png 21 July, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ దత్తత గ్రామంలో సమస్యలతో సహవాసం

21-07-2025 12:00:00 AM

రోడ్లు అధ్వానం రోడ్డుపైన మురుగునీరు 

శామీర్ పేట్, జూలై 20: మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మాజీ సీ ఎం కేసీఆర్ దత్తత గ్రామమైన లక్ష్మాపూర్ లోని పోచమ్మ బండ కాలనీ ప్రజలు కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. ఎ న్నో రోజులుగా డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

గ్రామం నుండి మున్సిపపాలిటీగా మారిన మా సమస్య మాత్రం మార డం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో లక్ష్మాపూర్ గ్రా మాన్ని దత్తత తీసుకొని గ్రామ అభివృద్ధి కో సం 16 కోట్ల రూపాయలను కేటాయించా రు. దీనిలో భాగంగానే పోచమ్మబండ కాలనీ కూడా ఉంది కానీ కాలనీలోని డ్రైనేజీ సమ స్య పనులు మాత్రం ఇంతవరకు మొదలుపెట్టలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. కా లనీలోని ఎక్కువ భూభాగం బండతో నిండి ఉండటంతో అక్కడ నివాసం ఉండే ప్రజల కు డ్రైనేజీ గుంతలు తీసుకోవడం ఇబ్బంది గా ఉండటంతో పైప్లైన్ సహాయంతో కాలనీ కి దూరంగా కాలనీవాసులకు సరిపడే విధంగా ఒక పెద్ద డ్రైనేజీ సంపును ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న పట్టించుకునే వారే లేరని అసహ నం వ్యక్తం చేశారు.

కాలనీలోనే డ్రైనేజీ నీరు రోడ్డుపై నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. వర్షాకాలం వస్తే ఈ సమస్య మరింతగా తీ వ్రతరంగా ఉంటుందని వర్షపు నీరు డ్రైనేజీ నీరు కలిసి కాలనీ రోడ్లపై వరదలుగా మారి ఎటు వెళ్ళాలో తెలియక ఇండ్ల ముందుకు వ స్తున్నాయని దీనితో దుర్వాసన వెదజల్లుతుందని అంతేకాకుండా డ్రైనేజీ నీరు త్రాగు నీరు పైపులో కలసి ఎర్రగా వస్తున్నాయని ఆ నీరు తాగడం వలన అనారోగ్యాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్వానంగా మారిన కాలనీ రోడ్డు

కాలనీలోని రోడ్లు వర్షాలకు చిత్తడిగా త యారై గుంతలమయంగా మారాయి. గుంతలలో వర్షం నీరు చేరి చిత్తడిగా తయారై వా హనాలకు, పాదచారులకు కనీసం నడిచేందుకు కూడా వీలులేకుండా ఉంది. గుంతల లో చేరిననీటిలో దోమలు, ఈగలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉం దని, జ్వరాలు కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

మహిళలు ఇంకా ఆరు బయటకు వెళ్లే పరిస్థితి ఉంది

తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతున్నా మా కాలనీ మాత్రం అభివృద్ధి చెందడం. లేదు కాలనీలోని డ్రైనేజ్ సమ స్య వల్ల కాలనీలో నివాసం ఉండే ప్రజలకు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి వీలు లేకుండా పోయింది. దీనితో మహిళలు ఆరు బయటకు వెళ్లే పరిస్థితి నెల కొంది ఇలా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారని కాలనీవాసులు చెబుతున్నారు. ఇ ప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను పట్టించుకోని పరిష్కరించాలని కోరుతున్నాము.

కాలనీ మహిళ దేవమ్మ