15 April, 2026 | 8:10 AM

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి

05-06-2025 12:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య

హనుమకొండ, జూన్ 4 (విజయ క్రాంతి): భద్రకాళీ చెరువు మత్తడి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని  సాగునీటి పారుదల శాఖ అధికారులను  హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం హనుమకొండ కాపువాడ సమీపంలోని భద్రకాళి చెరువు మత్తడి  నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

భద్రకాళి చెరువు అవుట్ ఫ్లో స్ట్రక్చర్ నిర్మాణ పనుల పురోగతి  గురించి సాగునీటి పారుదల శాఖ  డిఈ మధుసూదన్ రెడ్డి, ఏఈ వేణుగోపాల్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ  భద్రకాళి చెరువు అవుట్ ఫ్లో స్ట్రక్చర్ నిర్మాణ పనుల్లో మిగతా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ నాయబ్ తహసిల్దార్ రంజిత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.