calender_icon.png 21 February, 2026 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికురాలి కుటుంబానికి పరామర్శ

20-02-2026 12:00:00 AM

ములుగు, ఫిబ్రవరి19 (విజయక్రాంతి): జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న అనిరెడ్డి మణెమ్మ ఇటీవల కాలంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని జంపాల రవీందర్ పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులు ఎంతో శ్రమకోర్చి పనిచేస్తున్నారని, మధ్యాహ్న భోజన కార్మికుల తరపున ఏఐటీయూసీ యూనియన్ ఎన్నో పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలిచిందని, గత ప్రభుత్వాలు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండానే కాలయాపన చేస్తుందని, కావున ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం అయినా మధ్యాహ్న భోజన కార్మికులను మరియు అనిరెడ్డి మణెమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలు రమాలక్ష్మి, సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి సారయ్య, నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.