calender_icon.png 21 February, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీలో కలుషిత ఆహారం!

21-02-2026 01:53:25 AM

  1. 25 మంది విద్యార్థినులకు అస్వస్థత

మెదక్ జిల్లా రేగోడులో ఘటన

రేగోడు, పిబ్రవరి 20 : మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (కేజీబీవీ)లో కలుషిత ఆహారం తిన్న 25 మంది విద్యార్థినులు  శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందికి గురయ్యారు. పాఠశాలలో మె నూ ప్రకారం ఉదయం విద్యార్థినులకు, సిబ్బందికి అల్పాహారం వడ్డించారు. టిఫిన్ తిన్న కొద్ది సేపటికే కొంత మంది విద్యార్థినులు కడుపు నొప్పితో విలవిలలాడారు. ఆ తర్వాత వరుసగా మరికొందరు వాంతులు చేసుకోవడంతో పాఠశాల ప్రాంగణంలో ఆందోళనకర వాతావర ణం నెలకొంది.

పాఠశాల సిబ్బంది రేగోడ్ ప్రా థమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తు తం ప్రభుత్వ ఆసుపత్రిలో వీరికి అత్యవసర చికిత్స అందుతోంది. అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. పాఠశా లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను, కూరగాయలు, పిండి పదార్థాలను డాక్టర్లు తనిఖీ చేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి విజయ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

జీర్ణం కాకపోవడంతోనే: డీఎంహెచ్‌వో

విద్యార్థినులకు మధ్యాహ్నంతో పాటు రాత్రిపూట గుడ్డు పులుసుతో కూడిన ఆహారం తిన డం, ఉదయం అల్పాహారంగా గోధుమ రవ్వ తో చేసిన ఉప్మా తినడంతో వారికి గ్యాస్ట్రిక్ స మస్య ఏర్పడి వాంతులు, విరేచనాలు కలిగాయని, ఫుడ్ పాయిజన్ కాలేదని డీఎంహెచ్‌వో శ్రీరామ్ తెలిపారు. 15 మందిని డిశ్చార్జ్ చేశారని, ౧౦మంది చికిత్స పొందుతున్నారన్నారు.