22 June, 2026 | 11:40 AM

పాత విధానమే కొనసాగించండి

21-07-2024 12:12 AM

పాఠశాలల పనివేళలు యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి టీఆర్టీఎఫ్ వినతి

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): పాఠశాలల పనివేళలను ప్రస్తుతం ఉన్న విధంగానే యథావిధిగా కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్, అంజిరెడ్డి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం, శీతాకాలంలో ఉదయం 9 గంటల కల్లా పాఠశాలలకు చేరుకోవడం విద్యార్థులకు కష్టంగా ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉన్నత పాఠశాలలకు ఐదు కిలోమీటర్ల పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు హాజరవుతారని కావున ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల పనివేళలు యథావిధిగా కొనసాగించాలని కోరారు.