10 April, 2026 | 1:59 AM

ప్రభుత్వం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలి

10-04-2026 12:00 AM

మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్

బాన్సువాడ,ఏప్రిల్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్నా సుమారు 23,000కు పైగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలంటూ విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెండోవ రోజు ధర్నా నిర్వహించారు. గురువారం ఎన్పీడీసీఎల్ సమ్మె చేస్తున్న కార్మికులకు బిఆర్‌ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట జరుగుతున్నన సమ్మె వేదిక వద్దకు బిఆర్‌ఎస్ నాయకులు విచ్చేసి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ,కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు కీలకమైన సేవలను అందిస్తున్న విద్యుత్ కార్మికులకు కనీస న్యాయం చేయాల్సిన బాధ్యత  ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.రోజూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న ఈ కార్మికుల భవిష్యత్తు భద్రత కోసం వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.

కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జుబేర్ హెచ్చరించారు. జిల్లా మాజీ రైతు బందు అధ్యక్షులు అంజిరెడ్డి,జిల్లా ఏఐబిఎస్ ఉపాధ్యక్షులు బోడ రామ్ చందర్,కౌన్సిలర్లు ఖలీల్ ,ఫెరోజ్ ఖాన్,మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్,మాజీ వార్డు సభ్యులు అక్బర్,మైనారిటీ సెల్ నాయకుడు ఇషాక్,నాయకులు రమేష్ యాదవ్,మన్నే అనిల్ కుమార్,కార్యకర్తలు,పలువురు కార్మిక సంఘ నేతలు, తదితరులు పాల్గొన్నారు.