విద్యుత్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో విద్యుత్ సరఫరా విషయంలో ట్రాన్స్‌కో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పారిశ్రామిక వాడ సారపాకలో ఇప్పటికే 20 ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వినియోగదారులకు కరెంటు సరఫరాలో కోతలు లేకుండా ఎప్పటికప్పుడు లోవోల్టేజీ, హైవోల్టేజీ సమస్యపై విద్యుత్ సిబ్బందిపై ఆరాతీస్తూ ట్రాన్స్‌కో డీఈ జీవన్‌కుమార్ ఏడీఈ నర్సింహారావు, ఏఈ ఉపేందర్‌లతో కలిసి రాత్రి సమయాల్లో పర్యవేక్షణ చేస్తున్నారు.
సారపాకలో ట్రాన్స్‌ఫార్మర్ల లోడు ఎక్కువగా ఉండటంతో పాటు ట్రిప్ అవుతుండటంతో విద్యుత్ సిబ్బందిచే మరమ్మతులు చేపడుతూ, ఫీజులు పోయిన చోట వాటిని వేయిస్తూ వినియోగదారులకు కరెంటు సరఫరాలో ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం రాత్రి ట్రాన్స్‌కో సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్ల వేడిని తగ్గించేందుకు నీటితో తడిపే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.






