20 May, 2026 | 2:45 AM

నేరాలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలి

20-05-2026 12:00 AM

ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

నల్లగొండ క్రైం, మే 19 : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ,రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించే విదంగా సమర్ధవంతగా పని చేయాలనీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోపోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలోఅయన మాట్లాడారు జిల్లాలో నమోదైన పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, కోర్టు విచారణలు, నేరస్తులకు శిక్షలు పడేలా తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ UI కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్షీట్లు సకాలంలో దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు.

కోర్టు అధికారులతో సమన్వయం చేస్తుకుంటూ సీసీ నంబర్లు పెండింగ్, వారెంట్ల అమలు, పెండింగ్ సమన్ల తక్షణ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.NౄPS కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విదంగా పనిచేయాలని, మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, ప్రమాదకర కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు  హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలు అమలు చేయాలని సూచించారు.రాత్రి వేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ నేరాల నివారణకు రాత్రి, పగలు గస్తీలు నిర్వహించాలని, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు.

డయల్-100కు వచ్చే ప్రతి క్పా వెంటనే స్పందించి సంఘటన స్థలానికి తక్షణమే చేరుకోవాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కేసును బాధ్యతగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు.సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. బ్యాంక్ మోసాలు, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఆన్లైన్ ఫ్రాడ్లపై గ్రామ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేలా ప్రజలు, వ్యాపార సంస్థలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన సేవలు అందించాలనితెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ రవి,సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మినారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.