సమగ్ర శిక్ష ఉద్యోగులీలు చేపట్టండి: పాడ్య నాగేశ్వర రావు
దమ్మపేట,(విజయ క్రాంతి): సమగ్ర శిక్ష విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీలు వెంటనే చేపట్టాలని సిఆర్పి యూనియన్ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు పాడ్య నాగేశ్వర్రావు బుధవారం ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 21, 2026న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ, మే 1 నుంచి 31 వరకు బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసిందనీ, నాన్ టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలలీలు చేస్తున్న క్రమంలో నాన్ టీచింగ్ అయిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సిఆర్పి) లను అవసరమున్న వాళ్లకు బదిలి చేయాలన్నారు. గత 14 సంవత్సరాల నుండి సి ఆర్ పి లకు బదిలీ జరగక పోవడంతో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నారని, వారిని ఒకే చోట బదిలీ చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, కుటుంబానికి దూరంగా ఉంటూ, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం, పిల్లల బాగోగులు పట్టించుకోవడం కష్టమవుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 14 ఏళ్లుగా సి ఆర్ పి లకు బదిలీలు లేక వందలాది వినతిపత్రాలు అధికారులకు, నాయకులకు ఇచ్చినా స్పందన లేదని, ఈసారైనా కచ్చితంగా బదిలీలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.






