29 April, 2026 | 6:10 PM

బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ను విజయవంతం చేయాలి - రేగా

29-04-2026 03:44 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలో త్వరలో జరగబోయే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ డ్రైవ్ ను విజయవంతం చేయవలసిందిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపునిచారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ఈ మెంబర్షిప్ డ్రైవ్ విజయవంతం చేయుటకు నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. తక్షణమే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని ప్రతీ గ్రామపంచాయతీలో జెండాదిమ్మెలకు గులాబీరంగు వేసి దిమ్మెలపై పార్టీ నినాదాలు రాయించి, జెండా దిమ్మలను సిద్ధం చేయవలసిందిగా కోరారు.