29 April, 2026 | 6:09 PM

ప్రభుత్వ హాస్పటల్లో భరోసా కేంద్రం అవగాహన సదస్సు

29-04-2026 03:50 PM

జనగామ,(విజయక్రాంతి):  ప్రజాపాలన ప్రగతి ప్రణాలికలో భాగంగా,జిల్లా కేంద్రంలో పోలీస్ యంత్రాంగం చే నిర్వహిస్తున్న, భరోసా కేంద్రం సిబ్బంది జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దావకానలో మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భరోసా సేవలు, పితృస్వామ్యం, స్త్రీ ద్వేషం, లైంగిక దోపిడీ, బాల్య వివాహాలు, బాలల పై లైంగిక వేధింపులు, సైబర్ స్టాకింగ్, సైబర్ మోసాలు, సైబర్ సెక్యూరిటీ, బాలల హెల్ప్‌లైన్-1098, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్-1930 వంటి అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.