28 July, 2026 | 1:53 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

సీసీ కెమెరాలతోనే నేరాల నియంత్రణ సాధ్యం

09-06-2026 12:32 AM

డీసీపీ సి.శిరీష రాఘవేంద్ర

షాద్ నగర్ జూన్ 8 (విజయక్రాంతి): గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి సి.శిరీష రాఘవేంద్ర అన్నారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజులు కార్యచరణలో భాగంగా సోమవారం కొత్తూరు మండలంలోని ఎస్ బి పల్లిలో సర్పంచ్ సుమిత్ర మల్లారెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు ముఖ్యఅతిథిగా డిసిపి సి.శిరీష రాఘవేంద్ర హాజరయ్యారు.

ఈ సందర్భంగా డిజిపి శిరీష రాఘవేంద్ర మాట్లాడుతూ..నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె అన్నారు.గ్రామాల్లో చోరీలు జరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. బంధువుల ఇళ్లకు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. వాహనాలు నడిపేవారు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ నరసయ్య, డిప్యూటీ తాసిల్దార్ జంగయ్య, ఉప సర్పంచ్ గణేష్,మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.